తమిళనాడు రాజకీయాల్లో పూర్తిగా తెరమరుగైన జయలలిత మేనకోడలు దీప మళ్లీ తెర మీదికి వచ్చారు. 40పార్లమెంట్ స్థానాలకు, 18 ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలకు ఎంజీఆర్ అమ్మ దీప పేరవై(ఎంఏడీపీ) తరఫున అభ్యర్థులను దించేందుకు దీప సమాయత్తమయ్యారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో ఆశావహుల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తానని దీప ప్రకటించారు.
అయితే అమ్మ మరణాంతరం తరువాత దీప రాజకీయాల్లోకి వచ్చింది. ఏఐడీఎంకే పగ్గాలు చేపట్టాలని భావించి, చివరకు కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్నాడీఎంకే నుంచి కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు దీప పార్టీలో చేరారు. ఆ తరువాత కొద్ది రోజులకు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోయారు. చివరకు దీప భర్త మాధవన్ కూడా ఆమె పార్టీని విడిచి, కొత్త పార్టీని పెట్టిన విషయం తెలిసిందే.