నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీవ్ రైతు భరోసా దీక్ష చేశారు. పసుపు పంటకు కేంద్రంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పసుపు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రైతులు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రైతులను ఆదుకోకుండా ..కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి మరింత కృంగదీయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈదీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతు కష్టాలు ప్రభుత్వాలకు కనిపించడం లేదన్నారు నేతలు. కాంగ్రెస్ హయాంలో నెలకోల్పబడిన చక్కర పరిశ్రమలు కూడా ప్రస్తుతం మూతపడే స్థికి తెచ్చారని ఆపార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారాయన. గత పాలకులు ఏ హామీతో అయితే గద్దెనెక్కి ప్రజల్ని మోసం చేశారో…ఇప్పుడు అదే మాటలతో అధికారంలోకి వచ్చిన నేతలు రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సీతక్క. రైతుల ఆకాంక్షలు ప్రభత్వాలు పట్టించుకోవడం లేదన్నారామె. టీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు పసుపు రైతులకు న్యాయం చేయడం లేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ. పసుపు బోర్డు పేరుతో రైతుల్ని మోసం చేసిన ఏ పార్టీని ప్రజలు క్షమించరని వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆరేళ్ల క్రితం పసుపు పంటకు ఉన్న ధర ఇవాళ లేకపోవడం బాధారకరమన్నారు నేతలు. పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
కల్లూరులో టెన్షన్.. టెన్షన్.. ఏకగ్రీవంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడి