బీజేపీపై ఫైర్ అయిన ప్రియాంకా గాంధీ..

అయోధ్యలోని హునుమాన్ మందిర్‌ను సందర్శించారు ప్రియాంకా గాంధీ. అనంతరం.. ఆలయంలో ఆమె పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమేధీతో పాటు అయోధ్యలో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అయోధ్యలో స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ… ప్రధాని మోడీ విదేశాలకు చెందిన నేతలను కౌగిలించుకుంటున్నారని.. అదే దేశంలోని గ్రామీణ ప్రజలను ఒక్కసారి కూడా అక్కున చేర్చుకోలేదన్నారు. […]

బీజేపీపై ఫైర్ అయిన ప్రియాంకా గాంధీ..

Edited By:

Updated on: Mar 30, 2019 | 9:05 AM

అయోధ్యలోని హునుమాన్ మందిర్‌ను సందర్శించారు ప్రియాంకా గాంధీ. అనంతరం.. ఆలయంలో ఆమె పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమేధీతో పాటు అయోధ్యలో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అయోధ్యలో స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ… ప్రధాని మోడీ విదేశాలకు చెందిన నేతలను కౌగిలించుకుంటున్నారని.. అదే దేశంలోని గ్రామీణ ప్రజలను ఒక్కసారి కూడా అక్కున చేర్చుకోలేదన్నారు.

దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని, యువతను మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రియాంక. దేశాన్ని మొత్తం మోడీ అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఓట్ల రద్దు ప్రజలను చాల ఇబ్బంది పెట్టినా.. మోడీ పట్టించుకోలేదన్నారు. దేశంలో ఆడువారిపై ఇన్ని అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా.. మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు ప్రియాంక. బీజేపీని హిందూత్వశక్తులు అని ఆమె విమర్శించారు. అందుకే ఈసారి దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.