
CM YS Jaganmohan reddy condolence message : సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. “సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచి వేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అని ముఖ్యమంత్రి తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ కరోనాతో ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల ఆశిష్ ఏచూరి న్యూఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం కరోనా బారినపడిన ఆశిష్.. గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలిపుతున్నాను.” అంటూ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి… ఎలాగంటే..!
High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయలేం.. స్పష్టం చేసిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్