చిక్కుల్లో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఐపీసీ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు

|

Feb 12, 2021 | 9:15 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు..

చిక్కుల్లో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఐపీసీ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు
Follow us on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయతీకి వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన అంజలిని మనోహర్ బెదిరింపులకు గురి చేశాడన్న ఫిర్యాదు పై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన శివలక్ష్మి భర్త మంజునాథ్, మనోహర్ లు నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే చంపుతామని బెదిరించారని బాధితురాలు అంజలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మంజునాథ్ తోపాటు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ లపై ఐపీసీ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.