ఖమ్మంలో పట్టుకోసం గులాబీ దళం విశ్వప్రయత్నం

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మంది అధికార టీఆర్‍ఎస్‍లో చేరారు. అలాగే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఒకరు కారెక్కారు. దీంతో టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యేను కూడా తమ పార్టీలోకి తీసుకురావాలని టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు గాలం వేసింది. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి తనకు బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని, అయినా తాను మాత్రం […]

ఖమ్మంలో పట్టుకోసం గులాబీ దళం విశ్వప్రయత్నం

Updated on: Apr 02, 2019 | 3:49 PM

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మంది అధికార టీఆర్‍ఎస్‍లో చేరారు. అలాగే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఒకరు కారెక్కారు. దీంతో టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యేను కూడా తమ పార్టీలోకి తీసుకురావాలని టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు గాలం వేసింది. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి తనకు బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని, అయినా తాను మాత్రం టీడీపీని వీడేది లేదని మెచ్చా స్పష్టం చేశారు. తనకు తెలుగుదేశం పార్టీలో కొనసాగడమే ఇష్టమని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

గత డిసెంబరులో జరిగిన శాససనభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో టీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ అంతటా గులాబీ గాలి వీచినా ఖమ్మంలో మాత్రం ఆ పార్టీకి షాక్ తగిలింది. దీంతో ఎలాగైనా ఇక్కడ పట్టుసాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మంలోని కీలక నేత నామా నాగేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించి అక్కడ నుంచి ఎంపీగా పోటీకి నిలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us