పవన్ కల్యాణ్‌లా నటించడం మాకు చేత కాదు: బొత్స

| Edited By:

Sep 07, 2019 | 4:13 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌లపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స నారాయణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వంద రోజుల పాలనపై రాజకీయ నేతలు చేస్తోన్న కామెంట్స్‌ని తీవ్రంగా దూయబట్టారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎంగా జగన్.. వైఎస్సార్ పాలనను గుర్తు చేశారన్నారు. అలాగే.. జగన్ పాలను చూసి.. పలు పార్టీల నాయకులకు నిద్ర పట్టడం లేదని […]

పవన్ కల్యాణ్‌లా నటించడం మాకు చేత కాదు: బొత్స
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌లపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స నారాయణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వంద రోజుల పాలనపై రాజకీయ నేతలు చేస్తోన్న కామెంట్స్‌ని తీవ్రంగా దూయబట్టారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సీఎంగా జగన్.. వైఎస్సార్ పాలనను గుర్తు చేశారన్నారు. అలాగే.. జగన్ పాలను చూసి.. పలు పార్టీల నాయకులకు నిద్ర పట్టడం లేదని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు బొత్స. ఇప్పటికైనా.. పవన్ సినిమాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఒక పాత్రలో నటించడం తర్వాత దాని నుంచి బయటకొచ్చేయడం పవన్‌కల్యాణ్‌కు చేతవుతుందని చెప్పారు. తాను బాధ్యత గల మంత్రిగా వాస్తవాలే చెబుతానని తెలిపారు. రాజధానికి 5 వేల ఎకరాలు చాలని గతంలో పవన్‌ చెప్పలేదా అని ప్రశ్నించారు మంత్రి బొత్స.

అలాగే.. చంద్రబాబు, లోకేష్‌‌లపై కూడా పలు విమర్శలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నుంచి అర్థరాత్రి వేళ పారిపోయి వచ్చి రాష్ట్రానికి అడ్రస్‌ లేకుండా చేశారని విమర్శించారు. ప్రతీ దాన్నీ వివాదం చేయదలచుకోలేదని.. తాను వాస్తవాలే చెబుతున్నట్లు స్పష్టం చేశారు బొత్స.

ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ నెరవేరుస్తుండటంతో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ తట్టుకోలేకపోతున్నారని అన్నారు ఏపీ మంత్రి బొత్స. జగన్‌ది తుగ్లక్‌ పాలన అంటూ నారా లోకేష్‌ ట్టిట్టర్‌లో కామెంట్‌ చేయడంపై మండిపడ్డారు. చంద్రబాబుదే తుగ్గక్‌ పాలన అని తిప్పికొట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ.