తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు గ్రాడ్యుయేట్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైది రెడ్డి, చిరుమర్తి లింగయ్య బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే బ్రోకర్ల జనతా పార్టీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ విమర్శించారు. భువన గిరి లో బండి సంజయ్ ప్రేలాపనలు ఖండిస్తున్నామని చెప్పారు.
బండి సంజయ్ ఓ నత్తి నారాయణ… అంటూ ఏం మాట్లాడుతాడో అర్థమై చావదని గాదరి కిషోర్ ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో బండి సంజయ్ ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. కెసిఆర్ పుణ్యం వల్లనే సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యడనే సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. ఆయన బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీరప్పన్ బిడ్డ తమిళనాడు లో బీజేపీ లో చేరింది. తన నాన్నను మోడీలో చూసుకుంటున్నా అంటోంది. అవును దేశప్రజలు మోడీ ని వీరప్పన్ లానే భావిస్తున్నారని గాదారి ఎద్దేవా చేశారు.
బండి సంజయ్‌కి బాగా వాగడం అలవాటన్నారు గాదారి కిషోర్. ఐ టీ ఐ ఆర్ అంటే బండి సంజయ్ కు తేలుసా అని ప్రశ్నించారు. మోడీ నియోజక వర్గం వారణాసి లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ కి దక్కింది గుండు సున్నా. ఇకనైనా ప్రేలాపనలు మానక పోతే కరీం నగర్ లో ప్రజలు బండి సంజయ్ పై తిరగబడతారని అన్నారు. మోడీ గుజరాత్ ప్రధాని గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంబానీ, అదానీల కు మోడీ దేశ సంపద దోచి పెడుతున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ ఎమ్మెల్సీని మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అంటారా? ప్రజాస్వామ్యవాదులు ఎక్కడ పోయారు ? చట్టసభలంటే గౌరవం లేని సంజయ్ ను లోపల వేసినా తప్పు లేదు. బండి సంజయ్ బజారు రౌడీ తత్వాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఎన్నికల్లో కచ్చితంగా బుద్ది చెబుతుందని గాదారి తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా ఎక్కువే చేశాం. రిజెర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే మోడీ ప్రభుత్వరంగ సంస్థలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
హిందువుల పార్టీ బీజేపీ అంటున్న బండి కి పెరిగిన పెట్రోలు ,డీజిల్ ధరలతో హిందువులు కూడా బాధితులు అన్న సంగతి తెలియదా..? అని గాదారి ప్రశ్నించారు. మేము కూడా హిందువులమే. బండి సంజయ్ బ్రోకర్ల పార్టీ సారధి కనుకే అవతలి వాళ్ళను బ్రోకర్లు అంటున్నారు. రాత్రికి రాత్రే స్టేడియం పేరు ను మార్చి తన పేరిట పెట్టుకున్న ఘనుడు మోడీ. నయీమ్ వ్యవహారం లో చట్టప్రకారం చర్యలుంటాయి. నయీమ్ డబ్బును కక్కించడం సరే.. ముందు మోడీ హామీ ఇచ్చిన నల్ల ధనం కక్కించడం గురించి బండి సంజయ్ మాట్లాడాలని కిషోర్ అన్నారు. పీవీ తెలంగాణ బిడ్డ కనుకే ఆయన కు టీ ఆర్ ఎస్ సముచిత గౌరవం ఇస్తోంది. పీవీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీ లకు లేదు. పెట్రోలును కేంద్రం GST పరిధి లోకి తెస్తే రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయి.. అయినా కేంద్రం బలవంతంగా అమలు చేస్తే ఎవరు ఆపుతారని గాదారి కిషోర్ ప్రశ్నించారు.
పట్టభద్రులకు బండి సంజయ్ మాటలతో ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. మోడీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రధానులు అమ్మిదానికంటే డబుల్ అమ్మారు. దళితులకు- గిరిజలను మోడీ వాడుకుంటున్నారు. వేలకోట్ల అప్పులు ఎగవేసిన ప్రైవేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కాపలా కాస్తోంది. రూపాయితో సహా వడ్డీతో కట్టే ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. గుజరాతిలకు ఒకరేటు…ఆంధ్రుల హక్కు అన్న విశాఖ ఉక్కుకు ఒకరేటా అని ప్రశ్నించారు.
కులాలు- మతాలు అనేది దుబ్బాక- జిహెచ్ఎంసి లో నమ్మారు కానీ ఇక ప్రజలు నమ్మరని సైదిరెడ్డి చెప్పారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి పూర్తిస్థాయి స్పష్టత బీజేపీ నేతలకు లేదు. మొన్నటి వరకు కోజ్ ఫ్యాక్టరీ ఇస్తా అని..ఇప్పుడు లేదు అని మాట మార్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడి మాట అక్కడే మాట్లాడుతున్నారు. ఫ్యాషన్ షో పోజులు ఇచ్చినట్లు మోడీ ఫోటోల్లో బయట పనితీరు ఉండదు. బీజేపీ-కాంగ్రెస్ లు టీఆర్‌ఎస్‌కు పోటీయే కాదని సైదిరెడ్డి అన్నారు.
Read More: