సిక్కింలో ఎస్‌కేఎస్‌తో కలసి పోటీచేస్తున్నామన్న బీజేపీ

న్యూఢిల్లి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చ (ఎస్‌కేఎమ్) పార్టీతో కలసి తాము పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్‌కేఎమ్ పార్టీ నేతలు గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలసి ఈ విషయంపై చర్చించినట్లు ఆయన వివరించారు. సిక్కింలో రెండు పార్టీలు కలసి పోటీ చేసే విషయంలో అవగాహన కుదిరిందన్న […]

సిక్కింలో ఎస్‌కేఎస్‌తో కలసి పోటీచేస్తున్నామన్న బీజేపీ

Updated on: Mar 08, 2019 | 7:04 PM

న్యూఢిల్లి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చ (ఎస్‌కేఎమ్) పార్టీతో కలసి తాము పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్‌కేఎమ్ పార్టీ నేతలు గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలసి ఈ విషయంపై చర్చించినట్లు ఆయన వివరించారు. సిక్కింలో రెండు పార్టీలు కలసి పోటీ చేసే విషయంలో అవగాహన కుదిరిందన్న ఆయన.. సీట్ల విషయంలో మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతం సిక్కింలో ఎస్‌కేఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us