బద్దలైన పాతికేళ్ల భూమా ఫ్మామిలీ కోట.. మాజీ మంత్రి అఖిలప్రియకు కర్నూలులో మరో ఎదురు దెబ్బ

|

Jan 27, 2021 | 6:24 PM

అంతా అనుమానిస్తున్నట్టుగానే అయింది. భూమా పాలకోట బద్దలైంది. పాతికేళ్ల నుంచి కొనసాగుతున్న భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి..

బద్దలైన పాతికేళ్ల భూమా ఫ్మామిలీ కోట.. మాజీ మంత్రి అఖిలప్రియకు కర్నూలులో మరో ఎదురు దెబ్బ
Follow us on

అంతా అనుమానిస్తున్నట్టుగానే అయింది. భూమా పాలకోట బద్దలైంది. పాతికేళ్ల నుంచి కొనసాగుతున్న భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి తెరపడింది. కర్నూలు విజయ డైరీ ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న ఛైర్మన్‌ గిరీ ప్రత్యర్థులు లాక్కెళ్లిపోయారు. 25 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్గీయులు విజయం సాధించారు. దీంతో భూమా కుటుంబం మరో పదవిని కోల్పోయినట్టైంది.

నువ్వా నేనా అంటూ సాగిన ఎన్నికల్లో భూమా అఖిల ప్రియ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక విధంగా టీడీపీ, వైసీపీ మధ్య ఫైట్‌లో అధికార పార్టీ పై చేయి సాదించింది. పాతికేళ్లుగా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఉంటున్న ఛైర్మన్ పదవి భూమా ఫ్యామిలీ చేజారింది. వైసీపీకి చెందిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డి విజయ మిల్క్ డైరీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మెజారిటీ డైరెక్టర్లు జగన్‌కు మద్దతుగా చేతులెత్తేయడంతో ఆయన ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

కర్నాలు జిల్లా నంద్యాలలో విజయ డెయిరీ ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగాయి. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 81 మంది డెయిరీ సొసైటీ అధ్యక్షులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 25 ఏళ్లుగా వస్తున్న స్థానాన్ని కాపాడుకోవాలని భూమా అఖిల ప్రియ వర్గం ఆరాటపడగా… ఎలాగైనా దాన్ని బద్ధలు కొట్టాలన్నది ప్రత్యర్థులు ప్రతివ్యూహాలు రచించారు.

మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఈసారి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ అల్టిమేటం జారీ చేశారు. దీంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోటీ అనివార్యం కావడంతో వైసీపీ తరపున చైర్మన్ అభ్యర్థిగా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్మోహన్‌రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా కొనసాగిన భూమా నాగిరెడ్డి చిన్నాన్న నారాయణరెడ్డి వర్సెస్‌ ఎస్వీ జగన్మోహన్‌రెడ్డిగా మారింది. దీంతో మాజీ మంత్రి అఖిల ప్రియకు సవాల్‌గా మారింది. అనుకున్నట్టుగానే ఛైర్మన్‌ గిరీని వైసీపీ ఎగరేసుకుపోయింది.