ఆ మసీదులో నమాజ్‌ చేసినా పాపమే.. మసీదు నిర్మాణానికి ఎవరూ నయా పైసా ఇవ్వొద్దన్న అసదుద్దీన్‌ ఒవైసీ

|

Jan 28, 2021 | 3:31 PM

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన అయోధ్యలో కట్టబోయే మసీదును..

ఆ మసీదులో నమాజ్‌ చేసినా పాపమే.. మసీదు నిర్మాణానికి ఎవరూ నయా పైసా ఇవ్వొద్దన్న అసదుద్దీన్‌ ఒవైసీ
Follow us on

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన అయోధ్యలో కట్టబోయే మసీదును లక్ష్యంగా చేసుకుని కామెంట్స్‌ చేయడం సంచలనంగా మారింది. అయోధ్యలో ఐదు ఎకరాల భూమి తీసుకుని కట్టబోతున్న మసీదుకు చందాలు ఇవ్వడం తప్పన్నారు. అలాంటి మసీదులో నమాజ్‌ కూడా చెయ్యకూడదని దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు చెబుతున్నారని అసదుద్దీన్‌ అన్నారు.

దళితులకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు అసదుద్దీన్‌. ముస్లింలెవరూ దళితులతో పోటీ పడొద్దని సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినన్న అసద్‌… గాడ్సే ఫ్యాన్స్ దేశంలో అల్లర్లు కూడా సృష్టించగలరన్నారు. దేశంలో శాంతి కోరుకునేవారిని యాంటీ నేషనల్స్ పేరుతో జైలుకు పంపిస్తున్నారని అసద్‌ ఆరోపించారు.

ఎవరైతే బాబ్రీమసీద్‌ స్థలంలో ఐదెకరాల్లో తన పేర కట్టాలనుకుంటున్న ఆ మసీదు అనైతికమని రహ్మతుల్లా బతికుంటే చెప్పేవారు. మతపెద్దలు, ప్రబోధకులు, పర్సనల్‌లా బోర్డు..ఎవరిని అడిగినా వారు చెప్పిందొక్కటే. కూలగొట్టిన చోట 5ఎకరాల్లో కడుతున్న మసీదులో నమాజ్‌ చదవడం కూడా పాపమేనని చెప్పారు. దానికోసం డబ్బు ఇవ్వడం కూడా తప్పేనన్నారు అసదుద్దీన్‌.

ధనవంతులు డబ్బే ఇవ్వాలనుకుంటే నిరుపేద అమ్మాయిల వివాహానికి సాయపడండి. నిస్సహాయులకు దానమివ్వండి. అలాంటివారిని ఆదుకోండి..అంతేగానీ ఆ మసీదుకు మాత్రం నయాపైసా ఇవ్వొద్దు అంటూ అసదుద్దీన్‌ సంచలన కామెంట్స్‌ చేశారు.

అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు విడుదల..

Ayodhya Masjid: అయోధ్యలో మసీదు నిర్మాణానికి జనవరి 26వ