మరో నగారాకు సిద్ధమవుతున్న ఏపీ ఎస్‌ఈసీ, పంచాయతీ ముగిసిన వెంటనే ఆ ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ..?

|

Feb 06, 2021 | 11:58 AM

ఆధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో నగారా మోగించబోతున్నారా అంటే ఆయన తాజా వ్యాఖ్యలు అవుననే..

మరో నగారాకు సిద్ధమవుతున్న ఏపీ ఎస్‌ఈసీ, పంచాయతీ ముగిసిన వెంటనే ఆ ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ..?
Follow us on

ఆధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో నగారా మోగించబోతున్నారా అంటే ఆయన తాజా వ్యాఖ్యలు అవుననే అంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే పరోక్షంగా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల రంగులు మార్చే అంశంపై… ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలకు అనుమతి ఇవ్వలేదు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. దీనిపై హైకోర్టుకు వెళ్లింది ప్రభుత్వం. పేదలకు సంబంధించిన పథకం కాబట్టి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచించింది ధర్మాసనం. దీంతో ఈ వాహనాలను తన ఆఫీసుకు రప్పించి మరీ చూశారు నిమ్మగడ్డ. దానిపై ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేకపోయినా… అవి ముగిసిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి రంగులు మార్చాల్సిందేనని, అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో డోర్‌ డెలివరీ వాహనాలను అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

అయితే నిమ్మగడ్డ ఆదేశాలతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. రంగులు మార్చి వాహనాలను డోర్‌ డెలివరీకి సిద్ధం చేస్తుందా? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయ్యే వరకు పాత పద్ధతిలోనే రేషన్‌ను అందిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ నెల 21వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. అది ముగిసిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఇస్తారా? లేక ఈ లోపే ప్రకటిస్తారా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తారా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

 

Read more:

ఏకగ్రీవం ప్రజాసస్వామికం అయినప్పుడు వద్దనడానికి మీరెవరు..? ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే