‘నేను మూడోసారి మంత్రి.. పెద్దిరెడ్డి ఎక్కువసార్లు ఎమ్మెల్యే’, బాధతో, ఆవేదన చెందుతూ ఆ లేఖను ఖండిస్తున్నా: బొత్స

|

Jan 30, 2021 | 6:07 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపైనా, మంత్రి పెద్దిరెడ్డిపైనా గవర్నర్‌కు లేఖ రాయడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ..

నేను మూడోసారి మంత్రి.. పెద్దిరెడ్డి ఎక్కువసార్లు ఎమ్మెల్యే, బాధతో, ఆవేదన చెందుతూ ఆ లేఖను ఖండిస్తున్నా: బొత్స
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపైనా, మంత్రి పెద్దిరెడ్డిపైనా గవర్నర్‌కు లేఖ రాయడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిమ్మగడ్డ రాసిన లేఖలో తాము లక్ష్మణరేఖ దాటినట్టు పేర్కొన్నారని, ఆ లేఖను తాను ఖండిస్తున్నానని బొత్స పేర్కొన్నారు. గవర్నర్‌కు రాసిన లేఖ దురుద్దేశపూర్వకంగా, పక్షపాతంగా ఉందని బొత్స విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా లేఖలో భావం ఉందని బొత్స ఆరోపించారు. బాధతో, ఆవేదన చెందుతూ నిమ్మగడ్డ లేఖను ఖండిస్తున్నానని బొత్స చెప్పుకొచ్చారు. “నేను మూడోసారి మంత్రి.. పెద్దిరెడ్డి నా కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యాంగ, చట్ట ఉల్లంఘన దాఖలాలు, ఆలోచన మాకు లేదు” అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.