హోం మంత్రి అంటే కేవలం శాల్యూట్ లు అందుకునే వ్యక్తే కాదని,సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే సత్తా కూడా ఈ వ్యక్తికి ఉండాలని మహారాష్ట్రలోని సామ్నా పత్రిక పేర్కొంది. ఈ పార్టీ ఎంపీ , ఈ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా అయిన సంజయ్ రౌత్ ఈ మేరకు ఇందులో ఓ ఆర్టికల్ రాస్తూ.. రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కి ఈ పదవి కాకతాళీయంగా లభించిందని అన్నారు. జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్ తమకు ఈ పదవి వద్దని నిరాకరించిన అనంతరమే ఎన్సీపీ నేత అయిన అనిల్ కి ఈ పోస్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి లేఖ రాయడంతో ఈ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తిన్నదని, కానీ డ్యామేజీ కంట్రోల్ కి తగిన ప్రయత్నాలు జరగలేదని ఇందులో వ్యాఖ్యానించారు. హానెస్టీ (నిజాయితీ) అన్నదానికి గట్టి నాయకత్వం అవసరమని ఎవరైనా ఎలా విస్మరించగలుగుతారని ప్రశ్నించారు . సచిన్ వాజే వంటి ఓ జూనియర్ ఆఫీసర్ తన కార్యాలయం నుంచి డబ్బులు వసూలు చేస్తుంటే హోం మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది అని సంజయ్ రౌత్ అన్నారు.
అయితే ఈ ఆర్టికల్ పై స్పందించిన మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్.. అనిల్ దేశ్ ముఖ్ ని సమర్థించారు. అనిల్ కి ఈ పదవి కాకతాళీయంగా వచ్చిందేమీ కాదని, ఈ ఎడిటోరియల్ లో ఏవైనా లోటుపాట్లు రాసేముందు పాజిటివ్ మ్యానర్ లో అసలు వాస్తవాలను తెలుసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఏమైనా తనలోని లోటుపాట్లను హోం మంత్రి కూడా అధిగమిస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పోలీసు అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే డిపార్ట్ మెంటును హ్యాండిల్ చేయడంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉండాల్సిందని ఆయన పరోక్షంగా అనిల్ దేశ్ ముఖ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Khushboo promises : ప్రతీ ఆడపిల్లకీ లక్ష డిపాజిట్ చేస్తా.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న సినీనటి ఖుష్భూ