Tirupati bypolls: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం రేగింది. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. లోక్‌సభ పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్

Tirupati bypolls: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ
Tirupathi Bypoll

Updated on: Apr 17, 2021 | 1:21 PM

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం రేగింది. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. లోక్‌సభ పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ తొలుత ప్రశాంతంగానే ప్రారంభమైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి దొంగ ఓట్లు కలకలం రేపాయి.

కడప, కర్నూలు జిల్లాల నుంచి దొంగ ఓటర్లను వైసీపీ పెద్ద సంఖ్యలో తిరుపతికి రప్పించిందంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతికి ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కెనడీ నగర్, లక్ష్మీపురం కూడలి వద్ద దొంగ ఓటర్లను తీసుకొస్తున్నారంటూ బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

పోలింగ్ బూత్ లకు వచ్చినవారిని కూడా దొంగ ఓటర్లను కూడా అడ్డుకున్నారు టీడీపీ, బీజేపీ నేతలు వారి నుంచి ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో వందలాది మంది దొంగ ఓటర్లను తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దొంగ ఓటర్ల అంశంపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. దొంగ ఓట్లు వేసుకుని లక్షల ఓట్ల మెజారిటీ గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి అరాచక శక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలని కోరారు. పోలీసులే ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ ఓట్లర్లను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. అధికార పార్టీ నేతలను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకోరని ప్రశ్నించారు. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్వవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read: ‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది