రేపు నాలుగో విడుత పోలింగ్..సర్వం సిద్దం చేసిన ఈసీ

|

Apr 28, 2019 | 1:23 PM

లోక్ సభ ఎన్నికలకు మొత్తం 7 దశలుండగా… ఇప్పటికే మూడు దశలు పూర్తవగా… సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. బీజేపీ, కాంగ్రెస్… నాలుగో దశ ఎన్నికల్లో చావో, రేవో తేల్చకునేందుకు సిద్దమైపోయాయి.  9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం జరిగే పోలింగ్‌పై పార్టీలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌‌లో 13, బెంగాల్‌‌లో 8, మధ్యప్రదేశ్‌‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌‌లో […]

రేపు నాలుగో విడుత పోలింగ్..సర్వం సిద్దం చేసిన ఈసీ
Follow us on

లోక్ సభ ఎన్నికలకు మొత్తం 7 దశలుండగా… ఇప్పటికే మూడు దశలు పూర్తవగా… సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. బీజేపీ, కాంగ్రెస్… నాలుగో దశ ఎన్నికల్లో చావో, రేవో తేల్చకునేందుకు సిద్దమైపోయాయి.  9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం జరిగే పోలింగ్‌పై పార్టీలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌‌లో 13, బెంగాల్‌‌లో 8, మధ్యప్రదేశ్‌‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌‌లో 5, జార్ఖండ్‌‌లో 3, జమ్మూకాశ్మీర్‌ ఒక స్థానానికి పోలింగ్‌ జరగబోతోంది. వీటితోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా నాలుగో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని వేర్వేరు తేదీల్లో ఒకే దశతో ముగించిన ఈసీ… ఒడిశాకు మాత్రం నాలుగు దశల్లో నిర్వహిస్తోంది. సోమవారం జరిగే నాలుగో దశతో ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. కాగా అన్ని రాష్ట్రాల ఫలితాలు మాత్రం మే 23న తెలియనున్నాయి.