మోదీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన నాగార్జున

హైదరాబాద్ : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కొద్ది రోజులుగా త‌న ట్విట్ట‌ర్లో సెల‌బ్రిటీల‌ని ట్యాగ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చైత‌న్యం తీసుకురావాల‌ని కోరుతూ వ‌రుస ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మోహ‌న్ లాల్‌, అక్కినేని నాగార్జున‌ని ట్యాగ్ చేసిన మోదీ.. ఎన్నో ఏళ్ళుగా మీ న‌ట‌న‌తో మిలియ‌న్ల కొద్ది ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. మీరు భారీ స్థాయిలో ఓట‌ర్ల‌లో అవ‌గాహ‌న క‌లిగేలా ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి […]

మోదీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన నాగార్జున

Edited By:

Updated on: Mar 15, 2019 | 1:44 PM

హైదరాబాద్ : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కొద్ది రోజులుగా త‌న ట్విట్ట‌ర్లో సెల‌బ్రిటీల‌ని ట్యాగ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చైత‌న్యం తీసుకురావాల‌ని కోరుతూ వ‌రుస ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మోహ‌న్ లాల్‌, అక్కినేని నాగార్జున‌ని ట్యాగ్ చేసిన మోదీ.. ఎన్నో ఏళ్ళుగా మీ న‌ట‌న‌తో మిలియ‌న్ల కొద్ది ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. మీరు భారీ స్థాయిలో ఓట‌ర్ల‌లో అవ‌గాహ‌న క‌లిగేలా ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కి స్పందించిన నాగ్‌.. మీ మంచి మాట‌ల‌కి ధ‌న్య‌వాదాలు. మ‌న ప్ర‌జ‌స్వామ్యాన్ని మేము పూర్తిగా నమ్మాం. త‌ప్ప‌కుండా ఓటేస్తాం అని పేర్కొన్నారు. కాగా మోదీ గ‌తంలో స్వచ్ఛభారత్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడానికి ఇలా ప్ర‌ముఖుల‌ని మ‌మేకం చేసిన సంగ‌తి తెలిసిందే.