అత్యధికం నిజామాబాద్.. అత్యల్పం మెదక్

| Edited By:

Mar 26, 2019 | 6:20 PM

17 లోక్‌సభ స్థానాలకు గానూ తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 795నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.96కోట్లు ఉండగావారిలో 41.7లక్షలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. 6.5లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. ఇక నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 246నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యధిక నామినేషన్లు […]

అత్యధికం నిజామాబాద్.. అత్యల్పం మెదక్
Follow us on

17 లోక్‌సభ స్థానాలకు గానూ తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 795నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.96కోట్లు ఉండగావారిలో 41.7లక్షలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. 6.5లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు వారు పేర్కొన్నారు.

ఇక నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 246నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యధిక నామినేషన్లు పోలైన నియోజవర్గంగా నిజామాబాద్ మొదటి స్థానంలో నిలవగా.. 67 నామినేషన్లతో సికింద్రాబాద్, 48నామినేషన్లతో నల్గొండ మూడో స్థానంలో నిలిచాయి. అత్యల్పంగా మెదక్ లోక్‌సభ స్థానానికి 20నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇవాళ్టి నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తిరస్కరించనున్నారు. ఈ నెల 28 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.