నేడు నాలుగో విడుత పోలింగ్..బరిలో పలువురు ప్రముఖులు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడుత పోలింగ్ జరగనుంది. 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 961 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 12.79కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్‌కు […]

నేడు నాలుగో విడుత పోలింగ్..బరిలో పలువురు ప్రముఖులు

Updated on: Apr 29, 2019 | 6:26 AM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడుత పోలింగ్ జరగనుంది. 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 961 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 12.79కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షా 40వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మూడో విడుత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది. ఈసారి కూడా బెంగాల్లోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండడంతో భారీ ఎత్తున భద్రతా బలగాలను నియమించింది. ఈ ఎన్నికల్లో పలువరు ప్రముఖ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎస్ఎస్ ఆహ్లూవాలియా, బాబుల్ సుప్రియో, కాంగ్రెస్ తరఫున ఊర్మిళ, సల్మాన్ ఖుర్షీద్, మిలింద్ దేవ్‌రా, అధీర్ రంజన్ చౌదరి, ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, సీపీఐ నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు.