Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

గులాబీ బాస్ కొత్త టార్గెట్..!

Political Mirchi: KCR to announce ministerial posts only after municipal elections, గులాబీ బాస్ కొత్త టార్గెట్..!

పదవుల పందేరం ఎప్పడు? అనే ఈ ప్రశ్న కొన్నాళ్లుగా గులాబీ దళంలో వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయినా నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. త్వరలోనే భర్తీ అని సీఎం కేసీఆర్ చెప్పినట్లే చెప్పి ఇప్పడు మళ్లీ డెడ్ లైన్ పొడిగించారు. మళ్లీ ఎప్పుడో కొత్త ముహూర్తం?

ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ సమయంలో టీఆర్ఎస్ నేతలకు పదవుల జాతర అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. 12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు, మరికొంతమందికి రాజ్యసభ సీట్లు, ఇంకొందరికి ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ సీట్లు, మిగిలిన నేతలకు ఉన్నత పదవులు ఇస్తామని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత అటు అసెంబ్లీ, ఇటు మండలిలో విప్, చీఫ్ విప్ పదవులు మినహా మరేవీ భర్తీ చేయలేదు.

ఆల్రెడీ పదవుల పందేరంపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కొత్త డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపినవాళ్లకే పదవులు అంటూ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దాంతో పదవులు లేని ఎమ్మెల్యేలకు ఇది అగ్ని పరీక్షగా మారింది.

ఓ వైపు ప్రతిపక్షాలు మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇటు సొంత పార్టీలో టికెట్ల పంచాయితీ సూచిస్తోంది. ఇలాంటి సమస్యలను అధిగమించి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలి. అప్పుడే ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బయటకు ఈ విషయాన్ని చెప్పకున్నా అండర్ కరెంట్ కేటీఆర్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం నేతలు ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ మొదలు పెట్టారని తెలుస్తోంది.