Breaking News
  • వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం. పొలాలకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృతి. నల్లబెల్లి మండలం కొండాపురంలో ఘటన. మృతులు సుధాకర్‌, కొమ్మయ్యగా గుర్తింపు.
  • తమిళనాడుకు వరద ముప్పు. ఈరోడ్‌, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు. కర్నాటక కావేరి ఎగువప్రాంతంలోనూ భారీ వర్షాలు. సేలం జిల్లాలోని నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా చేరిన వరద. భవానీసాగర్‌ నిండడంతో కోడివేరి డ్యామ్‌ నుంచి నీరు విడుదల. పొంగిపొర్లుతున్న వైగైనది.
  • విజయవాడ: చిన్నారి ద్వారక హత్య కేసు. కాసేపట్లో ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం. ఈ నెల 10న నల్లగుంటలో అదృశ్యమై హత్యకు గురైన ద్వారక. మృతురాలి తల్లిని అర్ధరాత్రి వరకు విచారించిన పోలీసులు. నిందితుడు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడు ప్రకాష్‌ గురించి వెలుగులోకి వస్తున్న అనేక విషయాలు.
  • మధ్యప్రదేశ్‌లో అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు. సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్‌ తీవ్ర వ్యాఖ్యలు. అసద్‌ వ్యాఖ్యలపై జహంగీర్‌బాద్‌ పీఎస్‌లో అడ్వొకేట్‌ పవన్‌ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన జహంగీర్‌బాద్‌ పోలీసులు.
  • ఈ నెల 14న ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన. నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు బాలినేని, విశ్వరూప్‌, సురేష్‌.
  • విశాఖ: నకిలీ ష్యూరిటీ పత్రాల బెయిల్‌ కేసు. ఇద్దరు ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఏ1 కోటేశ్వరరావు, ఏ2 సూర్యనారాయణను.. మూడు రోజులపాటు విచారించిన పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితులు. ఇప్పటివరకు 216 కేసుల్లో ఫోర్జరీ పత్రాలను.. బెయిల్‌కు సమర్పించినట్టు ఒప్పుకున్న నిందితులు.
  • ప.గో: భక్తులతో కిటకిటలాడుతున్న ద్వారకా తిరుమల శివాలయం. రాత్రి 7గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం, అనంతరం ఊరేగింపు

Political Mirchi: కడపలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..!

Political Mirchi: BJP speedens operation aakarsh in Kadapa

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ రాయలసీమ మీద పడింది. సీమలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీ క్యాడర్‌కు గాలం వేసి కొంతవరకు సక్సెస్ అయిన బీజేపీ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

రాయలసీమ అభివృద్ధి పేరుతో సీమ జిల్లాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కమలదళం కడప జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తోంది. ఈ పర్యటనలో శనివారం ప్రొద్దుటూరులో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలను ఆహ్వానించారు.

ఈ నెల 15న కడపలో నిర్వహించే సమావేశంలో పార్టీలోకి చేరికలు, కేడర్ కు దిశానిర్దేశం చేయడమే ప్రధాన ఎజెండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే జిల్లానుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇవాలో రేపో కమలం గూటిలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఆది చేరికకు సీఎం రమేశ్ అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆది వస్తే తాను బయటకు వెళ్లడం ఖాయమంటూ కండిషన్ పెట్టినట్లు సమాచారం.

అయితే కమలదళం ఎత్తుగడలు టీడీపీలో కలవరం స్రుష్టిస్తున్నాయి. బీజేపీ ఎత్తుగడలను పరిశీలిస్తున్న టీడీపీ నాయకత్వం.. పార్టీని వీడేవారు స్వార్ధపరులని, పార్టీని వీడినంత మాత్రాన టీడీపీని ఎవరూ బలహీన పరచలేరని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తానికి కమలదళం ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇప్పట్నుంచే రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టేసింది.