
KTR

రూ.10కోట్లతో నిర్మించ తలపెట్టిన నారాయణపేట చేనేత కళాకారులందరికీ నైపుణ్య శిక్షణ కేంద్రానికి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.

నేతన్న చేయూత కార్యక్రమం ద్వారా గతేడాది రూ. 96 కోట్లు విడుదల చేశామన్నారు. కరోనా సమయంలో ఈ నిధుల వల్ల కార్మికులకు లాభం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

చిల్డ్రన్స్ ఐసీయూ వార్డులో ఏర్పాటు చేసిన వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్.

నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఐసీయూ వార్డులో మంత్రి కేటీఆర్.