గీత కార్మికులను చూసిన చమ్మగిల్లిన మాజీ ఐపీఎస్.. ఈత చెట్టు ఎక్కి ఈతి బాధలు తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్.. చిత్రాలు

|

Jul 30, 2021 | 7:26 PM

కుల వృత్తులకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

1 / 5
వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే లక్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యంతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

2 / 5
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన ఓ గ్రామంలో ఈత చెట్టు ఎక్కారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న ఆయన గీత కార్మికుల జీవనశైలి హృదయవిదారకమైందని పోస్టు పెట్టారు.

3 / 5
మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలో ఈత చెట్టు ఎక్కారు. చెట్లెక్కి వాళ్ల శరీరాలు గాయాలతో మొద్దుబారాయని చెప్పారు. తాను రెండు నిమిషాలు చెట్టుపై నిలబడలేకపోయానని తెలిపారు.

4 / 5
నిన్న కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అయా గ్రామాల్లో తిరుగుతూ.. పేదల జీవన శైలి గురించి తెలుసుకుంటున్నారు.

5 / 5
కుల వృత్తులకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు.