ఉద్రిక్తంగా మారిన ఏపీ అసెంబ్లీ..!

Police arrests MRPS activists over violations at AP Assemblyy, ఉద్రిక్తంగా మారిన ఏపీ అసెంబ్లీ..!

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ నేతలు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో.. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్సీ వర్గీకరణ.. రాజ్యాంగ విరుద్ధమన్న జగన్ వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో కొందరు ఎమ్మార్పీఎస్ నేతలను ముందుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ, ధర్నాలకు అనుమతిని నిరాకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *