uppula Raju |
May 15, 2022 | 6:49 AM
ఆయుర్వేద పండితులు పుదీనాని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. పుదీనా టీ శరీరంలోని అనేక నొప్పులని నయం చేస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
వేడి నుండి ఉపశమనం: పుదీనా వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ప్రజలు రోజుకు ఒకసారి పుదీనా టీ తాగాలి.
జీర్ణక్రియ: చెడ్డ జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు జీర్ణవ్యవస్థకు చాలా హాని కలిగిస్తాయి. అలాంటి సమయంలో పుదీనా టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
తలనొప్పి నుంచి ఉపశమనం: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరిగి తలనొప్పి మొదలవుతుంది. పుదీనా టీని రోజూ తాగితే తలనొప్పి పోతుంది.
చర్మం: పుదీనాలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పుదీనా టీ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.