
2025లో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా మూడు ప్రధాన ఆలయాల్లో దుర్ఘటనలు జరిగాయి. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట సందర్భంగా సుమారు ఆరుగురు భక్తులు మరణించగా మరో 40 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇక ఏప్రిల్ నెలలో విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో వర్షం కారణంగా గోడ కూలి ఏగుడురు భక్తులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. అలాగే నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన.. మెట్ల రైలింగ్ కూలడం ద్వారా సుమారు 9 మంది భక్తులు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలు ఆలయాల్లో భక్తుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇదిలా ఉండగా ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో కూడా అనేక మరణాలు సంభవించాయి. ముఖ్యంగా అక్టోబర్ 24 కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.ఈ ప్రమాదం ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇక ఈ నెలలో కూడా చింతూరు-మరేడుమిల్లి ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో లువు మరణించగా మరికొంత మంది గాయపడ్డారు. ఇక శుక్రవారం ఈ వార్త రాసిన రోజు ఉదయం తెల్లవారుజామున నంద్యాల జిల్లా అల్లగడ్డ వద్ద కారు బస్సును ఢీకొట్టి కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ మానవ తప్పిదాలే కాకుండా ప్రకృతి విపత్తుల కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదాలు సంభవించాయి. గత అక్టోబర్ నెలలో 'మోంథా' తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లక్షల మంది ప్రభావితులు అయ్యారు. అయితే ఈ విపత్త కారణంగా కొందరు మరణించినప్పటికీ.. మరణాల సంఖ్య అధికారికంగా వెలువడలేదు. మొత్తంగా 2025లో ఏపీ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆలయ తొక్కిసలాటల వల్ల 100 మందికిపైగా మరణించారు.