చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Edited By:

Updated on: May 25, 2026 | 2:33 PM

ఏలూరు: భారతదేశాన్ని పాలించిన రాజులు, నవాబులు, మరియు విదేశీ వర్తకులు తమ పాలనకు గుర్తుగా ఎన్నో కోటలు, కట్టడాలను నిర్మించారు. వందల సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఈ చారిత్రాత్మక కట్టడాల ద్వారానే.. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలను, నిర్మాణ నైపుణ్యాలను నేటి తరం వారు తెలుసుకోగలుగుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని ప్రముఖ ‘శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి (వై.ఎన్.) కళాశాల’ ప్రాంగణంలో ఉన్న పురాతన పరిపాలనా భవనం. మూడు శతాబ్దాలకు పైగా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ భవనం.. నాటి విదేశీ వాణిజ్యానికి, నేటి విద్యా ప్రగతికి వారధిగా నిలుస్తోంది. డచ్ కాలం నాటి వాచ్ టవర్.. బ్రిటీష్ వారి కార్యాలయం

1 / 5
నరసాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని విదేశీయులు వర్తక వాణిజ్యాలు నిర్వహించే రోజుల్లో.. సాగర సంగమానికి సమీపంలో, వశిష్ఠ గోదావరి తీరాన సరిగ్గా 1650వ సంవత్సరంలో డచ్ వారు ఈ భవనాన్ని నిర్మించారు. అప్పట్లో సముద్ర మార్గంలో ప్రయాణించే ఓడలు, వాడల కదలికలను నిఘా వేసి పర్యవేక్షించడానికి ఈ ఎత్తైన భవనాన్ని ఒక 'వాచ్ టవర్'గా ఉపయోగించేవారు. డచ్ వారి నిష్క్రమణ అనంతరం ఈ భవనం బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. బ్రిటీష్ పాలకులు సైతం ఈ భవన వైభవాన్ని చూసి ముగ్ధులై, దీనిని తమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ (కార్యాలయం)గా మార్చుకుని పాలన సాగించారు.

2 / 5
స్వాతంత్ర్యం తర్వాత విద్యా నిలయంగా రూపాంతరం..  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ చారిత్రాత్మక కట్టడం విద్యా మందిరంగా మారి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం ఇది శ్రీ వై.ఎన్. కళాశాల పరిపాలనా భవనంగా సేవలందిస్తోంది. నాటి నిర్మాణ నైపుణ్యం ఎంత పటిష్టమైనదో చెప్పడానికి వందల ఏళ్లుగా చెక్కుచెదరని ఈ భవనమే నిదర్శనం. ప్రస్తుతం ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో కళాశాల పరిపాలనా కార్యాలయం (ఆఫీస్) నడుస్తోంది. మొదటి అంతస్తు కళాశాల విద్యార్థినుల వెయిటింగ్ హాల్‌గా ఉపయోగపడుతోంది. ఇక రెండవ అంతస్తు కళాశాల గెస్ట్ హౌస్‌గా సేవలందిస్తోంది.

3 / 5
 సినీ, రాజకీయ ప్రముఖుల జ్ఞాపకాల వేదిక.. ఈ చారిత్రాత్మక కళాశాలలో చదువుకుని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఎందరో మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులకు ఈ భవనంతో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడే చదువుకున్న దర్శక రత్న దాసరి నారాయణరావు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి మహామహులు నరసాపురం వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ఈ భవనాన్ని వీక్షించడానికి వస్తుంటారు. ఇక్కడి గెస్ట్ హౌస్‌లోనే సేదతీరుతూ, తమ పాత కాలేజీ రోజులను, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఈ భవనం ముందు ఫొటోలు దిగడం ఇక్కడి పూర్వ విద్యార్థులకు ఒక మధురమైన అనుభూతి.

4 / 5
నాటి సైనిక సైరన్.. నేటి విద్యా గంట.. ఈ భవనం పైభాగంలో ఒక పెద్ద ఇత్తడి గంట ఉంది. డచ్, బ్రిటీష్ కాలంలో శత్రువుల కదలికలను గమనించి, సైనికులను అప్రమత్తం చేయడానికి ఈ భారీ గంటను ఉపయోగించేవారు. కాలం మారినా ఆ గంట ప్రాధాన్యత మాత్రం మారలేదు. ఇప్పటికీ ఈ కళాశాల యాజమాన్యం తరగతుల నిర్వహణ కోసం ప్రతి 50 నిమిషాలకు ఒకసారి ఈ పురాతన ఇత్తడి గంటనే మోగిస్తూ.. విద్యార్థులను పీరియడ్ల సమయం పట్ల అప్రమత్తం చేస్తోంది.

5 / 5
నాటి విదేశీ పాలకుల వ్యూహాత్మక స్థావరం.. నేడు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా నిలయంగా మారడం నిజంగా అభినందనీయం. ఇంతటి చారిత్రాత్మక వారసత్వాన్ని వై.ఎన్. కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఎంతో బాధ్యతగా సంరక్షించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Follow Us