
ప్రపంచంలో అతి సంపన్నమైన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నెంబర్ స్థానాల్లో ఉంటాయి. ఇక ప్రపంచంలోని అంత్యంత విలువైన కంపెనీల్లో అమెరికాకు చెందిన యాపిల్ మొదటి స్థానం దక్కించుకుంది. లండన్‌కు చెందిన హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2022 ఏడాదిలో సంపన్నమైన 500 కంపెనీల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఇందులో రిలయన్స్ అధినేత అంబానీ కంపెనీలతో సహా గౌతమ్ ఆదానీ కంపెనీలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ $202 బిలియన్ల విలువతో. ప్రపంచవ్యాప్తంగా 34వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, $139 బిలియన్ల విలువతో అత్యంత విలువైన భారతీయ కంపెనీల జాబితాలో దక్కించుకుంది.

ఈ జాబితాలోఈ లిస్ట్‌లో 20 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. యాపిల్ కంపెనీ 2.4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో మొదటి స్థానంలో ఉంది. 1.8 లక్ష కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ సంస్థ రెండో స్థానంలో ఉంది.

1.3 లక్షల కోట్ల డాలర్ల సంపదతో ఆల్ఫాబెట్ కంపెనీ మూడో స్థానంలో ఉంది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 1.2 లక్షల కోట్ల డాలర్లు నాలుగో స్థానంలో నిలిచింది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా 672 బిలియన్ డాలర్లతో కంపెనీలు ఐదు స్థానంలో నిలిచింది. బెర్క్‌షైర్ హథవే 624 బిలియన్ డాలర్ల సంపదతో ఆరోస్థానంలో ఉంది. వీటితో పాటు భారత్‌కు చెందిన మరిన్ని కంపెనీలున్నాయి.