- Telugu News Lifestyle Fashion Here is a trendy saree collection that enhances the beauty of women in telugu news
Latest Saree Trends: పండుగలు, పెళ్లిళ్ల కోసం మహిళల అందాన్ని మరింత పెంచే ఈ ట్రెండీ చీరలు బెస్ట్ ఎంపిక..
భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చుడీదార్లు, జీన్స్, ఫ్రాక్స్ ఇలా ఎన్నిరకాల డ్రెస్సులు వచ్చినా కొంచెం వయసు రాగానే ఆడవారు చీరలను ధరించడానికె ప్రాధాన్యతనిస్తారు.
Updated on: Dec 11, 2022 | 12:02 PM

బ్లాక్ కలర్ చీరలు : అవి చాలా సౌకర్యవంతమైన చీరలు. అలాగే ఇలాంటి కలర్ ఫుల్ చీరలు మిమ్మల్ని చాలా అందంగా చూపుతాయి.

నెట్ చీరలు: నెట్ చీరలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నెట్ చీరల జరీ, హెవీ బార్డర్‌లు, డీప్ నెక్ బ్లౌజ్ మీకు గ్రాండ్ లుక్‌ని ఇస్తాయి

రఫుల్ మోడల్ చీర : ఇది పూర్తిగా ఫ్యాన్సీ చీర. ఈ చీరలకు ఎలాంటి గ్రాండ్ జ్యువెలరీ అవసరం లేదు. ఈ రఫుల్ మోడల్ చీరల్లో మీ అందాన్ని పెంచుకోవడానికి మెరిసే బ్లౌజ్ ధరించండి.

మల్టీ కలర్ చీరలు: ఒక చీరలో చాలా రంగులు ఉంటాయి. ఈ చీర ఎటువంటి ఫంక్షన్‌కి అయినా మంచి ఎంపిక. ఈ చీర ధరించి గ్రాండ్ చెవిపోగులను పెట్టుకుంటే.. మీ అందం మరింత రెట్టింపు అవుతుంది.

పట్టు చీరలు (పట్టులో పాస్టెల్ చీరలు): ప్రస్తుతం పెళ్లి ఫంక్షన్లలో పాస్టెల్ కలర్ సిల్క్ చీరలు సందడి చేస్తున్నాయి. అవును, వివాహ వేడుకల్లో పట్టు చీరలు మీకు సంప్రదాయ రూపాన్ని అందిస్తాయి.

ఆర్గాన్జా చీరలు: మీకు సిల్క్ చీరలు నచ్చకపోతే ఆర్గాన్జా చీరలు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ చీరలు సిల్క్ లాగా ఉంటాయి. చాలా కాంతి వంతంగా అందంగా ఉంటాయి. వివాహ వేడుకలకు కూడా మంచి ఎంపిక




