World Laziness Day: సోమరులకూ ఓ రోజు.. రోడ్డుపై తమ మంచాలను ఏర్పాటు చేసుకుని మరీ వచ్చి ఉత్సవాన్ని జరుపుకున్నారు..

|

Aug 21, 2023 | 12:38 PM

వ్యక్తి అభివృద్ధి పథంలో పయనించాలంటే చురుకుగా పనిచేసుకోవాలి.. తెలివిగా ఆలోచించాలి.. అయితే కొందరిలో సోమరితనం ఉంటుంది. ఈ గుణం వ్యక్తుల అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. తమకు సోమరితనం హానికలిగిస్తుందని తెలుసు అయినప్పటికీ సోమరితనం, బద్దకాన్ని వదిలించుకోరు. మనిషిలో చెడు గుణం  గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే సోమరితనం దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఒకటి ఉంది తెలుసా.. 

1 / 6
కొలంబియాలోని ఇటాగుయ్ నగరంలో ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు తమ  ఉదాసీన స్థితిని చూపించడానికి.. తమ తమ మంచంపై కవాతు చేయడానికి రోడ్డుపైకి వచ్చారు. 

2 / 6
ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని ఆదివారం కొలంబియాలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజున మంచం మీద కవాతు జరిగింది. దీనిలో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు.

3 / 6
ప్రజలు రంగురంగుల దుస్తులలో కనిపించారు. ప్రజలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా రోడ్డు మీద మంచం మీద గడిపారు. కొందరు మంచం మీద నిద్రపోతుంటే మరికొందరు బద్ధకంగా ఆస్వాదిస్తూ కనిపించారు.

4 / 6
1984 నుండి ప్రతి సంవత్సరం  సోమరితనం దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు.  ప్రపంచ సోమరితనం దినోత్సవం 1984లో పరిశ్రమ, వాణిజ్యం , సంస్కృతికి సంబంధించిన పండుగ ముగింపు రోజుగా మొదలు పెట్టారు. 

5 / 6
ప్రపంచ సోమరితనం దినోత్సవాన్ని కొలంబియాలోని ఇటాగుయ్ నగరంలో తమ ఉదాసీన స్థితిని చూపించడానికి, ప్రజలు తమ మంచం మీద కవాతు చేయడానికి రోడ్డుపైకి వస్తారు.

6 / 6

ఈ రోజంతా ఉత్సవంలో నృత్యం, సంగీతం, థియేటర్ నాటకాలు ప్రదర్శనలు నిర్వహిస్తారు. 2012లో ప్రపంచ సోమరితనం దినోత్సవం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.