అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో చలి విజృంభిస్తోంది. అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. కెనడాలో కూడా మంచు తుఫాన్ ప్రభావం తక్కువగా ఏమీ లేదు. తుపాను కారణంగా అమెరికాలో కూడా 34 మంది చనిపోయారు.
న్యూయార్క్ నగరం చుట్టూ మంచు దుప్పటి కప్పుకుని ఉంది. అమెరికాలోని లక్షలాది మంది ప్రజలు మంచు తుపానులో చిక్కుకున్నారు. అంతే కాదు, మంచు కురుస్తుండటంతో అనేక నగరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
న్యూయార్క్‌లో మంచు తుఫాను కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మంచు ఎక్కువగా కురుస్తున్నందున ఇళ్లలో నుంచి బయటకు వస్తున్న వారికి ప్రమాదం తప్పడం లేదు. ఈ చిత్రంలో విద్యుత్ వైఫల్యం తర్వాత తన స్నేహితుడికి సహాయం చేయడానికి బయటకు వెళ్లిన ఒక వ్యక్తి కారు మంచులో చిక్కుంది.
దక్షిణ కొరియాలో కూడా భారీ హిమపాతం కురుస్తోంది. అయితే అక్కడ మంచు తుఫాను పడిన సూచనలు లేవు . ఇక్కడ ఫోటోలలో, స్థానిక ప్రజలు మంచును ఆస్వాదించడాన్ని చూడవచ్చు. సియోల్‌లోని జియోంగ్‌బాక్ ప్యాలెస్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు.
జర్మనీలో చాలా భాగం మందపాటి మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలు మంచును ఆస్వాదించడం చూడవచ్చు. ఈ చిత్రం జర్మనీలోని డ్రెస్డెన్‌లో మార్టిన్ లూథర్ విగ్రహం దగ్గర మంచుతో శ్వేత వర్ణంతో పరిసరాలు కనిపిస్తున్నాయి.
మంచు కురుస్తున్న సమయంలో రైలులో ప్రయాణిస్తూ జర్మనీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం 3,743 అడుగుల ఎత్తు ఉన్న వెర్నింగ్‌రోడ్ సమీపంలో మంచుతో కప్పబడిన హార్జ్ పర్వతాల గుండా వెళుతున్న జర్మన్ ఆవిరి రైలు.
ఉత్తర జపాన్‌లో కూడా భారీగా మంచు కురుస్తోంది. ఇక్కడ మంచు కురుస్తుండటంతో హైవేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ చిత్రం ఉత్తర జపాన్‌లోని నాగోకాలో ఉంది, ఇక్కడ ట్రక్కులు, కార్లు రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ లో కూడా భారీగా మంచుకురుస్తోంది. ఇక్కడ భారతీయ ఆర్మీ సైనికులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. శాంతా క్లాజ్ దుస్తులు ధరించి సందడి చేశారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ హిమపాతం కురుస్తోంది.
రిచ్‌మండ్, బ్రిటిష్ కొలంబియా, UK, వెస్ట్‌జెట్ , ఎయిర్ ఇండియా విమానాలు వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలివేశారు. ఇక్కడ మంచు తుఫాను కారణంగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది . వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో చాలా విమానాలను కూడా రద్దు చేయాల్సి వచ్చింది.