
మిస్ యూనివర్స్‌లో ట్రాన్స్‌జెండర్ల నుండి ప్లస్ సైజ్ మోడల్స్ వరకు పాల్గొన్నారు. అందుకే ఈ సారి మిస్ యూనివర్స్ పోటీలు చాలా రకాలుగా ప్రత్యేకంగా నిలిచింది. ఈవెంట్‌లో ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ సన్నగా ఉండే మోడల్‌ను సవాలు చేస్తూ కనిపించింది. అంతేకాదు జేన్ ఈవెంట్‌లో తన ఆధిపత్యం చెలాయించింది.

జేన్ దీపికా గారెట్ ఎవరంటే.. నిజానికి జేన్ దీపికా గారెట్ మిస్ యూనివర్స్ 2023లో నేపాల్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మోడల్.. ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు అందరూ ఆమెనే చూస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఆమె ప్లస్ సైజు.

మొదటి ప్లస్ సైజ్ మోడల్: మిస్ నేపాల్ జేన్ దీపికా గారెట్ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. అంతేకాదు ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె మొదటి ప్లస్ సైజ్ మోడల్‌గా నిలిచింది. జేన్ దీపిక తన స్టైల్‌తో అందరినీ పిచ్చెక్కించింది.

బాడీ పాజిటివిటీ: ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపిక బాడీ పాజిటివిటీని ప్రోత్సహించింది. అందానికి సైజు ముఖ్యమని భావించే వారు ఆ ఆలోచనను మార్చుకోవాలని జేన్ చెప్పింది. అందం అంటే శరీరం సైజు అనే ఆలోచన నుంచి ఇక నుంచి అయినా ఫ్యాషన్ రంగం, మోడల్ ప్రపంచం దూరంగా ఉండాలని కోరింది.

ఈ విధంగా బరువు పెరిగింది: జేన్ దీపికా గారెట్ విశ్వ సుందరి పోటీల్లో దాదాపు 20 మంది పోటీదారులను ఓడించింది. నివేదికల ప్రకారం హార్మోన్ల అసమతుల్యత కారణంగా గారెట్ బరువు పెరిగింది. అయితే ఆమె దానిని తన బలహీనతగా భావించలేదు.. పైగా తన బలంగా భావించింది

టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు: నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ను గెలుచుకున్నారు. మొదటి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, రెండో రన్నరప్‌గా ఆస్ట్రేలియాకి చెందిన యువతి నిలిచింది.