
శాంతియుత నిరసనలను అణిచివేసేందుకు పోలీసులకు అధికారాన్ని ఇచ్చే చట్టాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లో నిరసనకారుల వీధుల్లోకి వచ్చారు.

కొత్త చట్టన్ని నిలిపివేయాలంటూ "కిల్ ది బిల్" పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసనకారులు లండన్ , మాంచెస్టర్ , లీడ్స్, సౌతాంప్టన్ సహా అనేక నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మాంచెస్టర్‌లో కొత్త పోలీస్, క్రైమ్, సెంటెన్సింగ్, కోర్టుల బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. మరోవైపు ప్రదర్శనను రద్దు చేస్తూ స్థానిక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రిస్టల్ చట్టం వ్యతిరేకంగా మార్చి 21 న జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ప్రదర్శనకారులు ఒక పోలీస్ వ్యాన్‌ను ధ్వంసం చేశారు. అధికారులపై వస్తువులను విసిరారు. ఈ నేపథ్యంలోనే పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఉత్తర లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్‌లో ప్రదర్శనకారులు సమావేశమయ్యారు

'నేషనల్ వీకెండ్ ఆఫ్ యాక్షన్'లో భాగంగా అనేక నగరాల్లో ఈస్టర్ విరామంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.