నేటి కాలంలో త్వరగా బరువు తగ్గడానికి ఖరీదైన ఆహార ప్రణాళికలు, అనేక రకాల వ్యాయామాలు సర్వసాధారణంగా మారాయి. కానీ బరువు తగ్గాలంటే వ్యాయామం, ఆహారం రెండింటినీ సమతుల్యం చేయడం చాలా అవసరం. మహిళలు త్వరగా బరువు తగ్గేందుకు ఉపకరించే ఈ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విత్తనాలు: కొవ్వులను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గుమ్మడికాయ, అవిసె గింజలు, చియా గింజలలో ఫైబర్, ఒమేగా, విటమిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
పండ్లు: ఆపిల్, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కె ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. మీరు మీ ఆహారంలో ఆప్రికాట్‌లను కూడా చేర్చుకోవచ్చు.ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, బ్రెజిల్ నట్స్, పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు, జీడిపప్పులు బరువు తగ్గడానికి ఎఫెక్టివ్‌గా పరిగణించబడతాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిని కొంత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.
గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్: మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, మీరు ఓట్స్, రాజ్మా, బ్లాక్ బీన్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో అధిక ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి.