
పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల శరీరంలో ఎలాంటి నొప్పి నుంచైనా వేగంగా తగ్గుతుంది. పీరియడ్స్ సమయంలో పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇది గర్భాశయంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీనితో పాటు పసుపు ఈస్ట్రోజెన్ హార్మోన్‌కు సహజ ఔషధం. ఈ హార్మోన్ ఋతుస్రావాన్ని నియంత్రించగలదు.

కొంతమంది అమ్మాయిలు రొమ్ము నొప్పి కారణంగా విపరీతంగా టెన్షన్ పడుతుంటారు. అంటే ఇది పెద్ద సమస్యేం కాదుగానీ.. చాలా మంది అమ్మాయిలకు పిరియడ్స్ సమయంలో ఇలా రొమ్ము నొప్పి కూడా ఉంటుంది. ఇది ఋతుస్రావం ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు జరుగుతుంది. దీనికి కారణం హార్మోన్లలో మార్పు.

ఇది ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల కారణంగా ఉంటుంది. ఈ హార్మోన్లు రొమ్ము కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల వాపు, సున్నితత్వం పెరుగుతుంది. వీరికి పీరియడ్స్ సమయంలో రొమ్ములో బరువుగా అనిపిస్తుంది. దీంతో నీరసంగా అనిపించడం జరుగుతుంది. కొందరికి తేలికపాటిగా ఉంటే మరికొందరికి తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి తరచుగా ఋతుస్రావం ముగిసిన తర్వాత క్రమంగా తగ్గుతుంది.

కాఫీ, టీ, శీతల పానీయాలలో ఉండే కెఫిన్ రొమ్ము నొప్పిని మరింత పెంచుతుంది. పీరియడ్స్ సమయంలో వాటిని నివారించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు బ్రా లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కూడా రొమ్ము నొప్పి వస్తుంది.

పీరియడ్స్ తర్వాత కూడా నిరంతర ఈ నొప్పి బాధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో రొమ్ము నొప్పి రావడం సర్వసాధారణం. అయితే ఈ నొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. దీనికి ఆందోళన చెందాల్సిన విషయం కాదు. నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.