
ఇక జ్యోతిష్య వాస్త్రంలో వినాయకుడిని బుధ గ్రహ కారకంగా భావిస్తారు. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే, వారికి గణపయ్య ఆశీస్సులు లభిస్తాయి. అయితే వినాయక చవితి సందర్భంగా కొన్ని రాశుల వారిపై గణేశుడు తన సానుకూల ప్రభావాన్ని చూపించనున్నాడంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మకర రాశి : మకర రాశి వారికి గణేశుడి ఆశీస్సులు లభిస్తాయి. కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైన లాభాలు అందుకుంటారు.

మేష రాశి : మేష రాశి వారిపై వినాయకుడి చల్లని చూపు ఉండటం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు చేసే ఛాన్స్ ఉంది. ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. చాలా కాలం నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారి కల నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొననుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్నారో, వారి కల నెరవేరనుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.