
శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల వేలాది చర్మ సమస్యలు పుట్టుకొస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కాలంలో అనేక చర్మ సమస్యలు వస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారడం సాధారణం. మీ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వినియోగించడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

శీతాకాలంలో సన్‌స్క్రీన్ లేకుండా బయట అడుగు పెట్టడం అంత మంచిదికాదు. ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. సన్‌స్క్రీన్ చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడటమేకాకుండా మృదువైన చర్మాన్ని అందిస్తుంది.

పొడి చర్మం సోరియాసిస్, ఎగ్జిమా వంటి వివిధ చర్మ సమస్యలను కలిగిస్తుంది. శీతాకాలంలో అవి మరింత తీవ్రమవుతాయి. అయితే ఈ సీజన్‌లో కొబ్బరినూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా అవకాడో ఆయిల్‌ని రోజూ వాడితే చర్మం హైడ్రేట్‌గా ఉండి మృదువుగా ఉంటుంది.

పగిలిన చర్మానికి తేమను పునరుద్ధరించడానికి మాయిశ్చరైజర్లను ఉపయోగించవచ్చు. కానీ చర్మం తేమ లేకపోవడం వల్ల పగుళ్లు ప్రారంభమైతే, ఓట్ మీల్‌తోపాటు మిల్క్ పేస్ట్ అప్లై చేయండి

చలికాలంలో చర్మంతో పాటు పెదాలు కూడా పొడిబారిపోతాయి. పెదవులను తేమగా ఉంచుకోకపోతే పెదవులు పగిలిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులు పగిలి రక్తం కారుతుంది. పెదాలను హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి లిప్ బామ్ ఉపయోగించవచ్చు. అలాగే ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు పెదాలకు నెయ్యి అప్లై చేయాలి. అలాగే సీజనల్ కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగంగా తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.