
మనం ప్రతిరోజూ ఉపయోగించే బెడ్‌షీట్‌లను క్రమం తప్పకుండా కనీసం రెండు రోజులకు ఒకసారైనా మార్చకపోతే ఆరోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. మనకు పట్టే చెమట, డెడ్ స్కిన్ సెల్స్, ఆయిల్స్ పేరుకుపోయి హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోతాయి. ఇది ఫోలిక్యులిటిస్‌కు దారి తీస్తుంది. జుట్టు కుదుళ్ల చుట్టూ ఎరుపు, ఎర్రబడిన గడ్డలు వంటివి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు..

మీ ఇంట్లోని బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు వాష్ చేయకపోవటం వల్ల మొటిమలు, స్కిన్ అలెర్జీలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. మురికిగా మారిన బెడ్‌షీట్స్ బ్యాక్టీరియా, సెబమ్ కలిగి ఉంటాయి. ఇది మొటిమలను తీవ్రతరం చేస్తుంది. అలాంటి బెడ్‌షీట్‌ని రాత్రి యూజ్ చేశాక..ఆ మార్నడు ఉదయానికే మొటిమల తీవ్రత పెరుగుతుంది.

అనారోగ్యాన్ని కలిగించే శిలీంధ్రాలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో త్వరగా వృద్ధి చెందుతాయి. రోజుల తరబడి ఉతకని, అపరిశుభ్రమైన బెడ్‌షీట్ వాటికి అనువైన సంతానోత్పత్తి ప్రదేశంగా మలచుకుంటాయి. అలాంటి డర్జీ బెడ్‌షీట్ వాడటం వల్ల చర్మంపై రింగ్‌వార్మ్, పంగల్ ఇన్‌ఫెక్షన్ వంటి చర్మ సమస్యలు మురికిగా మారిన షీట్‌ల ద్వారా వ్యాపిస్తుంది. చర్మంపై దురద, ఎర్రబడటం, వృత్తాకార దద్దుర్లు వంటి సమస్య ఏర్పడుతుంది.

ఇంపెటిగో అనేది స్ట్రెప్టోకోకస్ లేదా స్టెఫిలోకాకస్ వంటి హానికరమైన బ్యాక్టీరియా.. చర్మంపైన ఏర్పడిన కట్స్, గాయాల ద్వారా ప్రవేశించినప్పుడు సంభవించే అంటువ్యాధి. మురికిగా ఉండే బెడ్‌షీట్స్ లలో ఈ బ్యాక్టీరియా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇంపెటిగో వ్యాప్తికి దారితీయవచ్చునని నిఫుణులు చెబుతున్నారు.

మరొక సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్ అథ్లెట్స్ ఫుట్.. అపరిశుభ్రమైన షీట్లలో ఉండే శిలీంధ్రాల ద్వారా ఇది సంక్రమిస్తుంది. అంతేకాదు, గొంతు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫ్యూసోబాక్టీరియా కూడా మురికిగా మారిన దుప్పట్లలో ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే.. బెడ్‌షీట్ల విషయంలో మీ బద్దకాన్ని కాస్త పక్కన పెట్టి ఎప్పటికప్పుడు మీ దుప్పట్లను మార్చేయటం, ఉతికేయటం ఇకనైనా మొదలుపెట్టండి.