చిన్న కథ కాదుగా..! స్విచ్‌ బోర్డులో రెడ్ లైట్ ఎదుందుకు ఉంటుందో తెలుసా? ఊహించలేరు గురూ..

Updated on: Aug 02, 2026 | 5:02 PM

ఇంట్లో ఉన్న స్విచ్‌ బోర్డులో వైట్ కలర్స్ బటన్స్‌తో పాటు చివరకు ఒక రెడ్ కలర్ లైట్ కూడా ఉడడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు.అన్ని స్విచ్‌లు ఆఫ్ చేసినప్పటికీ ఇది అలానే వెలుగుతూ ఉంటుంది. అసలు ఈ స్విచ్ ఎందుకు ఉంటుంది, అలా ఎందుకు వెలుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకూ ఈ స్విచ్ చేసే పని ఏమిటి.. ఇలాంటి డౌట్స్ మీకు వచ్చి ఉంటే కచ్చితంగా ఈ వార్త మీకోసమే. ఈ ప్రశ్నల వెనకున్న సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా ప్రతి ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి. వాటిలో బటన్స్‌తో పాటు చివరకు ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది. దాన్నే ఇండికేటర్ లైట్ అంటారు. పేరుకు తగ్గట్టే ఇది మనకు కొన్ని ముఖ్యమైన సమాచారాలను చేస్తుంది. ఈ లైట్‌ ద్వారానే మనం కరంట్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎందుకంటే  ఇది నేరుగా మెయిన్ స్విచ్‌తో అనెక్ట్ చేసి ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్న అన్ని స్విచ్‌లు ఆఫ్ చేసినా కూడా,  విద్యుత్ సరఫరా ఉన్నంతవరకు ఈ లైట్ వెలుగుతూనే ఉంటుంది.

2 / 5
అయితే ఇన్వర్టర్ వాడే ఇళ్లలో మాత్రం ఈ లైట్స్ భిన్నంగా ఉంటాయి. అలాంటి ఇళ్లలో ఉండే లైట్స్‌ రెండు వేర్వేరు రంగుల ఇండికేర్లను కలిగి ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఇల్లు మెయిన్ కరంట్‌తో నడుస్తోందో లేక ఇన్వర్టర్ ద్వారా నడుస్తోందో తెలియజేస్తాయి. అంతేకాదు ఈ లైట్‌ నుంచి వచ్చే వెలుగుతురు ఆధారంగా వోల్టేజ్‌ను మనం గుర్తించవచ్చు. వోల్టేజ్ తక్కువగా ఉంటే లైట్ డిమ్‌గా, వోల్టేజ్ బాగుంటే బ్రైట్‌గా వెలుగుతుంది.

3 / 5
అయితే ఈ లైట్ కరెంటు బిల్లు వినియోగాన్ని కూడా తెలియజేస్తుంది. రోజులో 24 గంటలు వెలగడం వల్ల కరంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా అబద్ధం. ఇది మనం వాడే సాధారణ ఫిలమెంట్ బల్బు కాదు. ఇది నియాన్ గ్యాస్ డిశ్చార్జ్ సాంకేతికతతో పనిచేసే చిన్న నియాన్ లైట్. ఇది కేవలం 0.2 నుండి 0.5 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటుంది.ఇది సంవత్సరం పొడవునా కంటిన్యూస్‌గా వెలిగినా కూడా, ఏడాదికి కేవలం 1 నుండి 2 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. దీనికి అయ్యే ఖర్చు కేవలం కొన్ని రూపాయలు మాత్రమే.

4 / 5
అయితే ఫ్రిజ్, గీజర్, ఎయిర్ కండిషనర్ వంటి ఎక్కువ విద్యుత్ వాడే పరికరాల 16-ఆంపియర్ స్విచ్ బోర్డులలో కూడా ఈ లైటే ఉంటుంది. ఇది వాటికి ఒక సేఫ్టీ వార్నింగ్‌లాగా లాగా పనిచేస్తుంది. ఒక వేళ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ వెలుగుతుంటే, సాకెట్‌లోకి ఇంకా కరంట్ సరఫరా అవుతోందని అర్థం. స్విచ్‌లోని పాయింట్లు లోపల ఒకదానికొకటి అతుక్కుపోవడం వల్ల ఇలా జరగవచ్చు. అలాంటప్పుడు వెంటనే స్విచ్ బోర్డును తనిఖీ చేయించాలి.

5 / 5
పెద్ద పరికరాల స్విచ్ బోర్డులో ఇండికేటర్ లైట్ సడన్‌గా ఆగిపోయినా లేదా సరిగ్గా వెలగకపోయినా, ఆ సాకెట్ పాడైపోయిందని అర్థం. వెంటనే దాన్ని రిపేర్ చేయించడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే, ఈ చిన్న ఇండికేటర్ లైట్ మన ఇంట్లో కరంట్ ఉందో లేదో చెప్పడమే కాకుండా, మనకు తెలియకుండా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కాపాడే ఒక చిన్న రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us