
Why Mark Zuckerberg Wears Same Grey T-Shirt Every Day? Know here: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఫేస్‌బుక్ (Meta) ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ధరించే దుస్తులను ఎప్పుడైనా గమనించారా? ఒకే రంగు టీ-షర్టులో ఎక్కువగా కనిపిస్తాడు. కారణం ఏమిటో తెలుసా..

ఎప్పుడూ గ్రే కలర్ టీ షర్ట్ మాత్రమే ధరించడం వెనుక దాగివున్న సీక్రెట్‌ను స్వయంగా జుకర్‌బర్గ్ చెప్పాడు.

2014లో పబ్లిక్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

నా జీవితాన్ని నా చేతులతో స్పష్టంగా మలచుకోవాలని అనుకుంటున్నాను. నా జాబ్ గురించికాకుండా అనవరసరమైన ఇతర విషయాల కోసం వృథాగా సమయాన్ని కేటాయించాలనుకోవడం లేదన్నాడు.

ఏం వేసుకోవాలి, ఏం తినాలి అనే విషయాలను నిర్ణయించుకోవడానికి చాలా సమయం, ఎనర్జీ వృథా చేసే అవకాశం ఉందని జుకర్‌బర్గ్ అంటున్నారు. సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం వీటన్నింటిని పట్టించుకోవట్లేదన్నాడు. అంటే బట్టల వంటి ఇతర అంశాలపై దృష్టి పెట్టడాన్ని జుకర్‌బర్గ్ టైం వేస్ట్‌గా భావిస్తున్నాడన్నమాట.