Biscuits: బిస్కెట్ల మధ్యన రంద్రాలు ఎందుకు ఉంటాయి.. వాటిని ఏమంటారో మీకు తెలుసా?

Updated on: Jan 20, 2026 | 8:00 AM

Why Do Biscuits Have Holes?: పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బిస్కెట్‌లు తినేందుకు ఇష్టపడతారు. ఉదయం టీలో, సాయంత్రం స్నాక్స్‌గా బిస్కెట్స్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే కొన్ని బిస్కెట్స్‌కు మధ్యలో రంద్రాలు ఉండడం మీరు గమనించే ఉంటారు. కానీ అలా ఎందుకు ఉంటాయో అని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న రహస్యం ఏంతో తెలుసుకుందాం పదండి.

1 / 5
 మనం ఎంలో ఇష్టంగా తినే బిస్కెట్‌లపై రంద్రాలు ఉండడం మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. బిస్కెట్లు అందంగా కనిపించడానికి ఇలా డిజైన్ చేశారని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వెనక అసలు రహస్యం వేరు ఉంది.

2 / 5
బిస్కెట్లు తయారు చేసేటప్పుడు, పిండి, చక్కెర, వెన్న, నీరు వంటి పదార్థాలను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో కాల్చినప్పుడు, లోపల ఆవిరి, గాలి ఉత్పత్తి అవుతాయి.

3 / 5
ఆ గాలి బయటకు వెళ్ళడానికి మార్గం లేకపోతే, బిస్కెట్లు ఉబ్బిపోతాయి లేదా మధ్యలో పగిలిపోతాయి. కాబట్టి ఈ సమస్యలను నివారించడానికి, బిస్కెట్ల తయారీ సమయంలో చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. వీటిని 'డాకింగ్ హోల్స్' అంటారు.

4 / 5
బిస్కెట్లకు ఇలా రంద్రాలు చేయడం ద్వారా వాటిని ఓవెన్‌లో పెట్టినప్పుడూ ఆవిరిని సులభంగా బయటకు వెళ్తుంది. ఇది బిస్కెట్లు సమానంగా, సరిగ్గా ఉడకడానికి సహాయపడుతుంది. అంతేకాదు బిస్కెట్స్ గట్టిగా మారకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

5 / 5
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రంధ్రాలు బిస్కెట్లు వాటి ఆకారాన్ని నిలుపుకోవడానికి సహాయపడతాయి. ఓవెన్ వేడిగా ఉన్నప్పుడు కూడా బిస్కెట్లు వంకరగా ఉండకుండా నిరోధిస్తాయి. అవి ఒకే పరిమాణంలో ఉంటాయి. దీనివల్ల అన్ని బిస్కెట్లు ఒకేలా కనిపిస్తాయి.