పిల్లలు కొత్తవారిని కలిసినప్పుడు ఎందుకు ఏడుస్తారు.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Sep 03, 2023 | 2:56 PM

కొత్తవారిని చూస్తే పిల్లలు ఏడవడం సహజం. అపరిచితులను చూస్తే పిల్లలు పెద్దగా ఏడుస్తారు. తల్లిదండ్రుల వెనుక దాక్కుంటారు. ఈ భయం వెనుక గల కారణాలేంటో మీకు తెలుసా..? కొత్తవారిని చూసినప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తారో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
చిన్నతనంలో పిల్లల స్వభావం ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కొంతమంది పిల్లలు ఎక్కువ ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఎక్కువగా నవ్వుతారు. కొంతమంది పిల్లలు అపరిచితులను చూస్తే భయపడతారు. అపరిచిత వ్యక్తుల దగ్గరకు వెళ్లాలంటే భయంతో ఏడ్చేస్తుంటారు.

2 / 5
అపరిచితుల పట్ల పిల్లల భయం చాలా సాధారణం. పిల్లలు తెలిసిన వాటిని ఇష్టపడతారు. ముఖం, స్వరం తెలియని వ్యక్తిని చూస్తే సహజంగానే చాలా భయపడతారు. ఆ భయంతోనే పిల్లలు ఏడుస్తుంటారు.

3 / 5
తెలియని వ్యక్తులను కలుసుకున్నప్పుడు లేదా వారి సంరక్షణలో పిల్లల్ని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు.. సహజంగా వారు అనుభవించే బాధను స్ట్రేంజర్ ఆందోళన అంటారు. ఇది సాధారణంగా 6 నుండి 8 నెలలలో ప్రారంభమవుతుంది.

4 / 5
పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులతో సురక్షితంగా భావిస్తారు. కానీ అపరిచిత వ్యక్తులను చూసినప్పుడు ఆ అనుభూతి కలగదు. కాబట్టి సహజంగానే భయం ఉంటుంది. అందుకే పిల్లలు కొత్తవారిని దగ్గరికి వెళ్లాలంటే భయంతో ఏడుస్తారు.

5 / 5
పిల్లల ప్రవర్తన సాధారణంగా ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 18 నెలల లోపు పిల్లలు ఇలా ప్రవర్తించడం సహజం. కానీ 18 నెలలు పైబడిన పిల్లలు ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఆందోళనకరంగా భావించాల్సిందే.. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం మంచిది.