Colonel Sophia Qureshi: శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?

Updated on: May 07, 2025 | 1:06 PM

పహల్గాం ఉగ్ర దాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తైంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. 9స్థానాల్లో 9షార్ట్స్ తో ఉగ్రమూకను మట్టుబెట్టింది. భారత సైన్యం చేతిలో సుమారు 30 మందిని హతమయ్యారు. ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం భారత సైన్యం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించింది. భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) కలిసి మాట్లాడారు. అయితే, ఈ ఆపరేషన్‌ లో పాల్గొన్న కల్నల్‌ సోఫియా ఖురేషీ ఎవరో తెలుసా..?

1 / 5
సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేసిన మన వీర సైనికులు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్‌లో ముస్లిం మహిళా సైనికాధికారి సోఫియా ఖురేషి కూడా పాల్గొన్నారు.

2 / 5
కల్నల్ సోఫియా ఖురేషి విలేకరుల సమావేశంలో వైమానిక దాడి గురించి సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఖురేషి విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా మాట్లాడుతూ, "అమాయక పర్యాటకులు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినట్టుగా వెల్లడించారు.

3 / 5
గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఖురేషి సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి. ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్‌లో సేవలందిస్తున్నారు. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిణి ఖురేషి సోఫియా.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఖురేషి సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి. ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్‌లో సేవలందిస్తున్నారు. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిణి ఖురేషి సోఫియా.

4 / 5
2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం.

2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం.

5 / 5
ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో కూడా ఆరేళ్ల పాటు సోఫియా ఖురేషి తన సేవలందించారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత మీడియాలో మాట్లాడిన ఖురేషి  ‘పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్‌ అన్నారు.

ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో కూడా ఆరేళ్ల పాటు సోఫియా ఖురేషి తన సేవలందించారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత మీడియాలో మాట్లాడిన ఖురేషి ‘పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్‌ అన్నారు.