
భారత్ జనాభాలో దాదాపు 38% నుండి 42% మంది శాఖాహారులు ఉన్నారు. జైన మతం, హిందూ మతం, బౌద్ధమతంలోని అహింస సూత్రాల కారణంగా భారతదేశం శాఖాహారంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దీంతో మన దేశం అత్యధిక శాతం శాఖాహారాన్ని కలిగి ఉన్న దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత స్థానంలో మెక్సికో ఉంది. మెక్సికోలో దాదాపు 19% మంది జనాభా శాఖాహారులు. ఇటీవలి సంవత్సరాలలో ఆరోగ్యం,జంతు హక్కుల గురించి పెరిగిన అవగాహన కారణంగా శాఖాహారం వైపు ఈ దేశం మొగ్గు చూపుతోంది.

మాంసాహార అలవాట్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్ కూడా మారుతోంది. ఇప్పుడు అక్కడ జనాభాలో దాదాపు 14% మంది శాఖాహారులు ఉన్నారు. ఈ ధోరణి ముఖ్యంగా పెద్ద నగరాల్లో కనిపిస్తుంది.

ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 13% మంది శాఖాహారులు ఉన్నారు. 'కోషర్' ఆహార చట్టాలు, 'శాకాహారి' ఉద్యమం ఇక్కడ చాలా ప్రభావవంతమైనవి. టెల్ అవీవ్ నగరాన్ని ప్రపంచంలోని 'శాకాహారి రాజధాని' అని కూడా పిలుస్తారు.

తైవాన్‌లోనూ దాదాపు 12% నుండి 13% జనాభా శాఖాహారులు. బౌద్ధమతం ప్రభావం, కఠినమైన ఆహార-లేబులింగ్ చట్టాల కారణంగా అధిక సంఖ్యలో శాఖాహారులు ఉన్నారు.