RBI: చిరిగిన లేదా తడిసిన నోట్లను మార్చాలా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

|

Dec 31, 2022 | 5:16 PM

మనలో చాలామంది కరెన్సీ నోట్ల విషయంలో ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. అసలు చిరిగిన నోట్లు చెల్లుతాయా.? నోట్లపై ఏదైనా రాసి ఉంటే.. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వాటిని తీసుకుంటారా.?

1 / 6
మనలో చాలామంది కరెన్సీ నోట్ల విషయంలో ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. అసలు చిరిగిన నోట్లు చెల్లుతాయా.? నోట్లపై ఏదైనా రాసి ఉంటే.. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వాటిని తీసుకుంటారా.? అలాగే వేరే రంగులోకి మారిన నోట్లు కూడా చెల్లుతాయా.? ఇలా మొదలైన వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అసలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
పాత, తడిసినా, చిరిగినా, లేదా రంగు మారిన నోట్లైన కూడా చెల్లుతాయని.. ఏ బ్యాంక్ కూడా వాటిని తీసుకోవడంలో నిరాకరించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ(కొత్త) శ్రేణితో సహా, వ్రాసిన లేదా వేరే రంగులో ఉన్న ఏ నోట్లు అయినా.. వాటిపైన అంకెలు స్పష్టంగా కనిపిస్తుంటే.. వాటిని తీసుకోవడంలో ఏ బ్యాంక్ కూడా నిరాకరించదు. అలాగే ఆ నోట్లను ఏదైనా బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.

3 / 6
కరెన్సీ నోట్లపై రాజకీయ లేదా మతపరమైన సందేశాలు వ్రాసినా, అందుకు సంబంధించిన చిత్రాలు ఉన్నా, అలాంటి నోట్లు చెల్లవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది కాకుండా, ఏదైనా వ్యక్తి లేదా సంస్థ ప్రయోజనాల కోసం సహాయపడినట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(నోట్ రీఫండ్) రూల్స్, 2009 ప్రకారం నోట్లకు సంబంధించి అటువంటి క్లెయిమ్‌ను బ్యాంక్ రద్దు చేస్తుంది.

4 / 6
మీరు ఏదైనా సంబంధిత బ్రాంచ్‌కి వెళ్లి మ్యుటిలేట్ చేసిన నోట్లను కూడా మార్చుకోవచ్చు. మ్యుటిలేటెడ్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు సర్క్యులర్లను జారీ చేస్తూనే ఉంటుంది. అటువంటి నోట్లను మీరు ఏదైనా బ్యాంకు శాఖలో లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో సులభంగా మార్చుకోవచ్చు.

5 / 6
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అలాగే ఈ నోట్ల మొత్తం విలువ రూ.5000 మించకూడదు. అదే సమయంలో బాగా కాలిపోయిన, మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోలేరు.

6 / 6
మీరు బాగా కాలిపోయిన, మ్యుటిలేటెడ్ నోట్లను కేవలం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులో ఎలాంటి ఛార్జీ వేయదు. దానిని సులభంగా మార్చవచ్చు.