
చాలా మంది ఉదయం కప్పు వేడి వేడి కాఫీ లేదా టీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే వేడిగా టీ లేదా కాఫీ తాగడం ఆనందంగా అనిపిస్తుంది. అయితే రోజు మొత్తంలో ఎక్కువగా టీ లేదా కాఫీ తాగితే అది ఎముక సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మోకాలి నొప్పి సంభవిస్తుంది.

ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో ఎక్కువగా టీ, కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరం.

చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. అయితే రోజు మొత్తంలో లెక్కకుమించి ఎక్కువగా టీ లేదా కాఫీ తాగితే ఎముకల సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మోకాలి నొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇది మాత్రమే కాదు ఈ అలవాటు మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి శీతాకాలంలో కూడా వీలైనన్ని ఎక్కువ పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. మీ రోజువారీ ఆహారంలో పండ్ల రసాలను చేర్చుకోవచ్చు.

రోజుకు కనీసం రెండుసార్లు టీ లేదా కాఫీ తాగడం మంచిది. అంతకంటే ఎక్కువ తాగడం డేంజర్. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేయాలి.