
వాపు తగ్గుతుంది: ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపుకు కారణమవుతాయి. నెల రోజుల పాటు వీటికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో అంతర్గత వాపులు తగ్గి, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుంది.

మెరుగైన పేగు ఆరోగ్యం: మాంసం కంటే మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 30 రోజుల పాటు తృణధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెంది, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మలబద్ధకం నుండి విముక్తి: మాంసంలో ఫైబర్ ఉండదు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దానికి బదులుగా కూరగాయలు, చిక్కుళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ప్రోటీన్ లోపం - శక్తి మాంసం ద్వారా శరీరానికి అందే ప్రోటీన్, ఐరన్ అకస్మాత్తుగా అందకపోవడం వల్ల ప్రారంభంలో కొంచెం నీరసంగా లేదా అలసిపోయినట్లు అనిపించవచ్చు. మాంసం మానేసినప్పుడు ప్రోటీన్ లోటును భర్తీ చేయడానికి పప్పు ధాన్యాలు, సోయా, పనీర్ లేదా గుడ్లు వంటి ఇతర ప్రోటీన్ ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది.

చైనా తర్వాత అత్యధికంగా చికెన్ తినే దేశం అమెరికా. పాకిస్తాన్‌లో ప్రతి వ్యక్తి సంవత్సరానికి దాదాపు 9 కిలోల చికెన్ తింటాడు. అదే చైనాలో అయితే ప్రతి వ్యక్తి దాదాపు 17 కిలోల చికెన్ తింటాడు.