Drumstick Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు పొందండి!

Updated on: Apr 03, 2025 | 12:10 PM

ఆయుర్వేదంలో మునగను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు.. ఎందుకంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకవిలువలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. మునగ చెట్ల ఆకులు, కాయలు, పూలు, మరియు వేర్లు ఇలా అన్ని భాగాలూ ఉపయోగకారమే. వీటిలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్స్ ఏ, సి, ఈ, తోపాటు పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకల దృఢత్వానికి అత్యంత కీలకం. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీటిని తీసుకోవటం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మునగాకు పోషకాల ఖజానగా పిలుస్తారు. మునగ ఆకులకి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో చెప్పిన విధంగా వాత, కఫ, పీత వంటి రోగాలను నయం చెయ్యగల లక్షణం మునగ ఆకులకు ఉంది. పరగడుపున మునగ ఆకుల నీటిని తాగడం వలన, శరీరంలో ఉండే మలినాలు శుభ్రం చేస్తుంది.  అంతేకాకుండా రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రణలో ఉంచడంలోనూ తోడ్పడుతుంది. దీనితో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందుతుంది.

2 / 5
మునగాకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మునగాకు రసం శరీరంలో కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

మునగాకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మునగాకు రసం శరీరంలో కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

3 / 5
మునగలోని గుణాలు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, మధుమేహాన్ని నియంత్రించడంలో తోడ్పడతాయి. మునగ ఆకుల నీటిని ప్రతిరోజు తాగడం వల్ల ఇలాంటి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు మునగాకుల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గి, కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

4 / 5
Drumstick Leaves

Drumstick Leaves

5 / 5
డయాబెటిస్ రోగులకు మునగాకు రసం చాలా ప్రయోజనకరం. శరీరంలోని విషతత్వాలను తొలగించడానికి మునగాకు రసం సహాయపడుతుంది. ఉదయాన్నే మునగాకు రసం తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మితంగా తీసుకోవడం మంచిది.