ఖర్జూరం గింజలతో కాఫీ.. ఖతర్నాక్ బెనిఫిట్స్..! ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

Updated on: Feb 22, 2025 | 11:38 AM

ఖర్జూరం శక్తిని తక్కువగా అంచనా వేసి పొరపాటు చేయకండి. ఎందుకంటే..ఈ ఆహారం అనేక పోషకాలకు నిలయం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇదోక వరంలా పనిచేస్తుంది. మెదడు శక్తి పెరుగుతుంది. గర్భిణీలకు ప్రసవవేధనను తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన స్వీటెనర్, దీనిని చక్కెరకు బదులుగా తీసుకోవచ్చు. ఖర్జూరాలతో పాటు, ఖర్జూర విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ మనలో చాలామందికి దీని గురించి తెలియదు. కాబట్టి ఖర్జూరం తిన్న తర్వాత దాని విత్తనాలను పారవేస్తారు.

1 / 5
ఖర్జూరం కంటే దాని విత్తనాలు రెట్టింపు లాభాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం విత్తనాలు గుండెకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూర గింజలు సిరల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా మొదలైన వాటిని నివారిస్తుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరమైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

2 / 5
ఖర్జూర గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరం. ఖర్జూర గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి, ఆకలి తగ్గుతుంది. 

3 / 5
ఖర్జూర గింజలు కాల్షియం, భాస్వరంకు మంచి మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మూత్రపిండాలకు కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి.

4 / 5
జిమ్ వ్యాయామాలు చేసే వారు ఖచ్చితంగా ఈ ఖర్జూర విత్తనాలను తినాలి. ఇవి పనితీరును మెరుగుపరుస్తాయి. కండరాలలో వాపును తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి హానిని నివారిస్తాయి. ఖర్జూర విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కడుపు సులభంగా శుభ్రం అవుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు.

5 / 5
కొన్ని విత్తనాలను సేకరించి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి, మీడియం మంట మీద పాన్ లో వేయించాలి. అవి కరకరలాడుతున్నప్పుడు, వాటిని తీసి మీ ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో 1 చెంచా చొప్పున తీసుకొచ్చు. లేదంటే, ఆ పొడిని నీరు లేదా తేనెతో కూడా కలిపి రోజుకు ఒకసారి తినవచ్చు.