Health Tips: పచ్చి కొత్తిమీర తింటున్నారా..! శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

|

Mar 28, 2024 | 11:40 AM

కొత్తిమీర ఆహారాన్ని రుచిగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్-సి లు పుష్కలంగా ఉంటాయి. అయితే వంటల్లో వేసుకుని కాకుండా పచ్చికొత్తమీరను తింటే కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చికొత్తిమీరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పచ్చి కొత్తిమీర తినటం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు పచ్చి కొత్తిమీరను తింటూ ఉంటే ఆ సమస్య త్వరగా తీరిపోతుంది. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మధుమేహం బాధితులకు పచ్చి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. రోజూ కాస్త పచ్చికొత్తిమీర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో రక్తంలో ఇన్సులిన్ పరిమాణం నియంత్రణలో ఉంటుంది.

2 / 5
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఫలితంగా గుండెపోటు సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

3 / 5
పచ్చికొత్తిమీరతో కళ్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది. మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.  పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటిచూపు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

4 / 5
పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చికొత్తిమీరను తింటే మూత్ర సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరానికి చలువ చేసే గుణం పచ్చి కొత్తిమీరకు ఉంటుంది.

5 / 5
అంతేకాదు, పచ్చికొత్తిమీరతో ప్రాణాంతక క్యాన్సర్ వంటి ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్-ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీక్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.